Breaking News

భలే మంచి లంచ్‌ బేరం

Published on Thu, 04/11/2024 - 07:17

సాధారణంగా ఒక హోటల్‌లో లంచ్‌ చేస్తే సుమారు రూ.500 బిల్లు అవుతుంది.. అదే స్టార్‌ హోటల్‌ అయితే రూ.1000 నుంచి రూ.1500. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని టీడీపీ నేతల ఇళ్లల్లో మాత్రం లంచ్‌ ఖరీదు రూ.లక్షల్లోనే ఉంటుంది. లంచ్‌ ఒక్కటే కాదు.. టీ, టిఫిన్, డిన్నర్‌ ఏదైనా చాలా ఖరీదు చేసేశారు. ఇంతకీ ఈ లక్షల రూపాయల లంచ్‌ గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే.  

సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓట్ల రాజకీయంతో పనికాదని గ్రహించి.. నోట్ల రాజకీయాలకు తెర తీసింది. ప్రత్యర్థి పార్టీ నేతలను లంచ్, డిన్నర్‌కి పిలిచి బేరాలు పెడుతోంది. సర్పంచ్‌ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి వరకూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేస్తోంది. ఇందులో సిద్ధ హస్తుడుగా ఉన్న గంటా శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకొని.. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు ఇదే ఫార్ములా అవలంబిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను సంతలో పశువుల్లా బేరాలాడి కొనేస్తే చాలని లెక్కల్లో తలమునకలయ్యారు. లంచ్, డిన్నర్‌ పేరుతో లక్షలు ముట్టజెబుతున్నారు. 
 
గంటా రూటే సేపరేట్‌ 
టీడీపీ పెద్దల కాళ్లా వేళ్లా బతిమాలి ఎట్టకేలకు భీమిలి టికెట్‌ సాధించుకున్న గంటాకు ఎన్నికలంటే డబ్బుతో గెలవడమే అనే నైజం. ప్రజలన్నా నాయకులన్నా ఆయన దృష్టిలో ఓటును, వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనస్తత్వం కలవారు. రూ.500కి వెయ్యకపోవచ్చు.. రూ.వెయ్యికి వెయ్యకపోవచ్చు.. రూ.2 వేలు.. ఇలా.. ఏదో ఒక నంబర్‌ దగ్గర ఓటరు తనకు లొంగుతారనే విర్రవీగే మనస్తత్వంతో రాజకీయాలు చెయ్యడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఇదే మాదిరిగా చోటా మోటా నాయకులకు సైతం వెలకడుతున్నారు. గంటా ఒక్కరే కాదు టీడీపీ నుంచి టికెట్‌ కొనుక్కున్న ప్రతి ఒక్క నాయకుడూ ఇదే రీతిలో ఆలోచిస్తూ రాజకీయాలి్న, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. 

విలువలు అమ్ముకుంటూ రాయ‘బేరాలు’ 
వెన్నుపోటు రాజకీయాలు మొదలైనప్పటి నుంచి విలువలను విడిచిపెట్టి అడ్డగోలుకు కేరాఫ్‌గా మారిపోయింది టీడీపీ. అంతా ఆ తాను ముక్కలే అన్నట్లుగా పార్టీలలో ఉన్నవారంతా కనీస విలువలు లేకుండా వ్యవహరిస్తున్నారు. డబ్బుతోనే ఏదైనా సాధ్యమనే అహంకారంతో విర్రవీగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థులు తమ ఇంటికి లేదా సమీపంలో ఉన్న ఓ హోటల్‌కి భోజనానికి ఆహ్వానించడం.. రాయ‘బేరాలు’ మాట్లాడుకోవడమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నారు. బేరం కుదిరిన వెంటనే చోటా నేతలు కండువాలు కప్పేసుకుంటున్నారు. 

►చోడవరంలో టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ రాజు ఇటీవలే పలువురు ప్రత్యర్థి పార్టీ నేతలను నోట్ల కట్టలతో కొనుగోలు చేసుకున్నారు. 

►పాయకరావుపేటలో వంగలపూడి అనిత.. ఓ హోటల్‌లో సామాజికవర్గ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులను ఆత్మీయ సమావేశం పేరిట ఆహా్వనించారు. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతూ సర్పంచ్‌కు రూ.2 లక్షలు, ఎంపీటీసీ సభ్యుడికి రూ.5 లక్షలు, 100 ఓట్లు ప్రభావితం చేసే సామాజికవర్గ నాయకుడికి రూ.5 లక్షలకు బేరం పెట్టేసుకున్నారు. 

►పెందుర్తిలో పంచకర్ల రమేష్‌ బాబు సైతం అదే రాయబేరాలు సాగిస్తున్నారు. ఈయన రూ.లక్ష నుంచి తన బేరాలు మొదలు పెడుతున్నారు. 

►ఇవి కేవలం మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ప్రజలకు ఇంకా అందించాల్సిన మౌలిక సదుపాయాలు, వారి అభిప్రాయాలు సేకరిస్తుంటే.. టీడీపీ అభ్యర్థులు మాత్రం.. నేతల కొనుగోలులో బిజీబిజీగా గడుపుతున్నారు. 

రూ.2 కోట్లకు డీల్‌..! 
భీమిలి నియోజకవర్గంలో జరిగిన బేరం ఖరీదు అక్షరాలా రూ.2 కోట్లు. ఇక్కడ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకుడి మద్దతును టీడీపీ నేతలు కోరారు. అతడు ఒప్పుకోలేదు. బతిమలాడారు.. లంచ్, డిన్నర్‌కు ఆహా్వనించారు. పనవ్వలేదు. స్వయంగా వాళ్లే భోజనానికి వెళ్లారు. అర కోటి నుంచి బేరం మొదలైంది... చివరికి రూ.2 కోట్లకు డీల్‌ కుదిరింది. అక్కడికి వచ్చిన వారు కూడా ఆశ్చర్యపోయారు. అలాగే భీమిలిలో ఓ జెడ్పీటీసీ సభ్యుడికి రూ.10 లక్షల ధర పలికింది. మరికొందరు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు బేరాలు కుదిరినట్లు తెలిసింది. కొంతమంది మాజీ నేతలు, పలుకుబడి ఉన్న నేతలకు కూడా మరో రేటు ఫిక్స్‌చేసినట్లు సమాచారం.  

సీఎం రమేష్‌ రాకతో పెరిగిన రేట్లు 
300 మంది రౌడీ మూకలను వెంటబెట్టుకొని అనకాపల్లిలో అడుగుపెట్టిన మాజీ టీడీపీ, ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్‌ రాకతో.. ఆయా ప్రతినిధులు తమ రేట్లను అమాంతం పెంచేసుకుంటున్నారు. తమను నమ్ముకొని ఉన్న ప్రజలను పక్కన పెట్టేసి.. తమకింత ఇస్తే చాలు.. మీ పార్టీ కండువా కప్పేసుకుంటామంటూ బేరాలాటలో మునిగితేలుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులకు అమ్ముడుపోయి.. పార్టీ కండువాలు మార్చేసుకుంటూ.. టీడీపీ పంచన చేరుతున్న నేతలను చూసి జనం ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపించామా అని అసహ్యించుకుంటున్నారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)