Breaking News

‘బీజేపీ నాకు రెండో చాన్స్‌ ఇవ్వదు’

Published on Tue, 07/30/2024 - 07:28

లక్నో: మాజీ బీజేపీ ఎంపీ, మాజీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో రెండో చాన్స్‌ అంటూ ఉండదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.  లైంగిక ఆరోపణల కారణంగానే బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తనకు టికెట్ లభించలేదా? అనే మీడియాకు ప్రశ్నకు స్పందించారు.

‘నా కుమారుడికి బీజేపీ ఎంపీగా టికెట్ ఇచ్చింది.కానీ బీజేపీ నా కుమారుడు కరణ్‌ భూషణ్‌ టికెట్‌ ఇస్తే విజయం సాధించాడు. నాకు బీజేపీ ఇక ఎప్పుడూ నాకు రెండో చాన్స్‌ ఇవ్వదు. నాకు బీజేపీ మరో అవకాశం ఇవ్వదని కూడా తెలుసు. నేను ముంగేరిలాల్‌ వలే ఎప్పుడూ కలలు  కనలేదు’ అని అన్నారు.

ఇక.. గత ఏడాది బ్రిజ్ భూషన్‌ రెజ్లింగ్ ఫెడరేన్‌ ఉంటూ పలువురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై తీవ్ర దుమారం రేపాయి. ఈయన్ను ఫెడరేషన్‌ చీఫ్‌గా తొలగించాలని రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. రెజ్లర్ల నిరసన నేపథ్యంలో ఆయన ఆ పదవి నుంచి తొలగించబడ్డారు. దీంతో ఆయనకు బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు.  కానీ, ఆయన కుమారుడికి టికెట్‌ ఇవ్వటంతో విజయం సాధించారు. బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక ఆరోపణల కేసులో గత వారం విచారణ ప్రారంభమైంది. అయితే తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారు. ‘నేను ఏ తప్పు చేయలేదు. ఎందుకు ఒప్పుకుంటాను?’అని అంటున్నారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)