Breaking News

గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు మరో నేత రాజీనామా

Published on Thu, 04/18/2024 - 10:09

మేడ్చల్: తెలంగాణ అసెంబ్లీ​ ఎ‍న్నికల్లో ఓటమిపాలై అధికారంలో కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అయితే తాజాగా మరో నేత బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రటించారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు తన రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ పలువరు కీలక నేతలు బీఆర్‌ఎస్‌ను వీడటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నగేందర్‌ ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు కే. కేశవరావు, పట్నం మహేందర్‌రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి అధికార కాంగ్రెస్‌ కండువ కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నగేందర్‌ను సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా నిలపటం గమనార్హం.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)