కాంగ్రెస్‌లోకి రండి 

Published on Fri, 09/01/2023 - 03:04

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆయన్ను పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి రేవంత్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి వెళ్లారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలి, ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తుమ్మలతో రేవంత్‌ బృందం చర్చించింది.

ఖమ్మం జిల్లా రాజకీ య సమీకరణాల్లో భాగంగా పార్టీలోకి రావాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. రేవంత్‌  ఆహా్వనం నేపథ్యంలో తుమ్మల సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఆయన ఏఐసీసీ నేతల సమక్షంలో కాంగ్రెస్‌లోకి వస్తారని  చెబుతున్నారు­. కాగా, తుమ్మల ఈసారి ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాలేరులో పోటీ సాధ్యం కాకుంటే  ఖమ్మం అసెంబ్లీ నుంచి ఆయన బరిలో ఉంటారని, తుమ్మల ఎక్కడి నుంచి పోటీ చేసినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు కొత్త బలం వస్తుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.   

ఖమ్మం జిల్లా నేతలను దూరం పెట్టడంపై విమర్శలు... 
తుమ్మలతో భేటీకి పార్టీ ఖమ్మం జిల్లా నేతలను రేవంత్‌ దూరం పెట్టడం కాంగ్రెస్‌లో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బదులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డి, పాలమూరుకు చెందిన మల్లు రవిని తీసుకెళ్లి తుమ్మలను పార్టీలోకి ఆహా్వనించడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)