Breaking News

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌

Published on Wed, 07/22/2026 - 18:53

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్‌సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్‌ వేధింపులు ఆగడం లేదు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసుతో సంబంధం లేకపోయినా కక్ష సాధిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు.. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు సీదిరి అప్పలరాజును తరలిస్తున్నారు. సీదిరి అప్పలరాజు ఇంటి దగ్గర  పోలీసులు మోహరించారు. పోలీసులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ పీఎస్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

సీదిరి అప్పలరాజు అరెస్టుకు నిరసనగా పలాసలో వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. పోలీస్ స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో పలాస మార్మోగింది. అప్పలరాజు అరెస్టు కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్‌సీపీ మండిపడింది. వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. పలాసలో కార్యకర్తలు  భారీగా తరలివచ్చారు. ఆందోళనతో పలాస పట్టణం ఉద్రిక్తంగా మారింది.

కూటమి సర్కార్‌ కక్ష సాధింపుల ప్రభుత్వంగా మారిపోయింది.. 
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల ప్రభుత్వంగా మారిపోయిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లా అండ్‌ ఆర్డర్‌ను వదలేసి  కక్ష సాధింపుల ప్రభుత్వంగా మారిందని , వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సీదిరి అప్పలరాజుపై రాజకీయంగా కక్ష సాధింపులు సమంజసమా? అంటూ ప్రశ్నించారు. బీసీ సోదరులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు ఆపాలని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

‘‘రోడ్డు ప్రమాదాన్ని మర్డర్ కేసుగా మార్చటం సిగ్గుచేటు. సాయికృష్ణ లాకప్‌డెత్, దళితుడు క్రాంతికుమార్ ఆత్మహత్య, గుంటూరులో మహిళను వివస్త్ర చేయటం వంటి ఘటనలతో రాష్ట్రం పరువు పోయింది. రాష్ట్రంలో తప్పు చేసిన వారిని శిక్షించే పరిస్థితి లేదు. కేవలం వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేయటమే పోలీసుల పనిగా మారింది. బీసీ వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు అరెస్టు అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీలు, దళితులపై వేధింపులు సరికాదు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. మా పార్టీ నేతలపై ఇలాగే వేధింపులు ఇలాగే కొనసాగితే తీవ్రంగా స్పందిస్తాం’’ అని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)