Breaking News

టార్గెట్‌ సీదిరి!

Published on Thu, 07/30/2026 - 07:26

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేరపూరిత హత్య..నేర పూరిత కుట్ర.. తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం.. సాక్ష్యాలను మాయం చేయడం..నేరస్తుడిని కాపాడేందుకు తప్పుడు సమాచారం.. అబద్ధమని తెలిసినా సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం.. నేరానికి ప్రేరేపించడం..’ఇవీ రోడ్డు ప్రమాదం కేసులో సంబంధం లేని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై మోపిన అభియోగాలు. అసలు యాక్సిడెంట్‌ సమయంలో అప్పలరాజు అక్కడ లేరు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని వెళ్లిన అప్పలరాజే పోలీసులకు సమాచారం అందించారు. 

అలాంటప్పుడు అప్పలరాజుపై అభియోగాలు మోపడం రాజకీయ కుట్ర కాకపోతే ఏమనాలి.. కక్ష సాధింపులో భాగమని అనడానికి ఇంకేం చెప్పాలి.. రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్ద్‌ త్యాడి కాదని, సీదిరి తనయుడు ఆరవ్‌ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే, ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి త్యాడిని ఇరికించి ఉంటే కచ్చితంగా నేరమవుతుంది. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది. కానీ, సీదిరి కుమారుడు ఆరవ్‌ ఫోన్‌ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్‌ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేటు వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్‌ ఏమాత్రం పోలేదు. అలాంటప్పుడు ఇందులో హత్య కోణం ఎక్కడుందో పోలీసులు..వారిని ప్రేరేపించిన పాలకులే చెప్పాలి.   

ఇన్ని సెక్షన్లా? 
సీదిరి అక్రమ అరెస్టు కేసులో నమోదైన సెక్షన్లు చూసిన వారెవరైనా రోడ్డు ప్రమాదం కేసులో ఇన్ని సెక్షన్లు పెట్టొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. న్యాయ కోవిదులు కూడా పోలీసుల తీరును ఆక్షేపిస్తున్నారు. యు/ఎస్‌ 105 ఆర్‌/డబ్లూ 61(2) అఫ్‌ బీఎన్‌ఎస్, 231,238,240, 242,249 ఆర్‌/డబ్ల్యూ 49బిఎన్‌ఎస్‌ సెక్షన్లను సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ పోలీసులు బనాయించారంటే దానివెనక ఎంత రాజకీయం నడించిందో ఇట్టే అర్ధమవుతుంది. పాలకులు కావల్సినట్టు పోలీసులు వ్యవహరించారని స్పష్టమవుతుందంటూ ఆరోపణలు ఉన్నాయి. 41 నోటీసు ఇచ్చి స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేయాల్సిన ఘటన కేసులో తొలుత కుమారుడిని, ఆ తర్వాత తండ్రిని అరెస్టు చేశారంటే ఎంత క«థ నడిచిందో అర్ధమవుతోంది.   

చంద్రబాబు అండ్‌కో పగ.. 
వెనకబడిన, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి కక్ష కట్టింది. తొలి రోజు నుంచే వేధింపులకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయానికి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోంది. ఎన్ని కేసులు పెట్టినా జైలు పంపించలేకపోయామన్న కసితో కక్ష సాధింపునకు ఎదురు చూసింది. ఈనేపథ్యంలో కాశీబుగ్గలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై కుట్రలకు దిగి, సీదిరి అప్పలరాజును ఇరికించింది.

 సంబంధం లేని కేసులో ఏ3గా పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించింది. పెదబాబు, చినబాబు డైరెక్షన్‌లో, జిల్లాకు చెందిన నేతల ఒత్తిళ్లతో పోలీసులు కథ నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మత్స్యకార సామాజిక వర్గ నాయకుడిగా, విద్యా, వైద్య వేత్తగా, మాజీ మంత్రిగా అనతికాలంలో బలమైన నేతగా ఎదిగిన సీదిరి అప్పలరాజును అరెస్టు చేసే సమయంలో పోలీసు అధికారులు అనుచితంగా వ్యవహరించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా, ఆయన సోదరుడిపైనా చేయి చేసుకున్నారు.  

 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)