Breaking News

రూ. కోటి డిమాండ్‌ చేసిన ఎంపీపై కేసు నమోదు

Published on Tue, 06/11/2024 - 08:57

బీహార్‌లోని పూర్ణియా లోక్‌సభ స్థానం నుంచి ఇటీవలే ఎన్నికైన ఎంపీ కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఎన్నిక అయ్యాడో లేదో.. బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇవే ఆరోపణలపై ఆయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి... 

పూర్ణియా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్‌ నాలుగున వెలువడిన విషయం మనకు తెలిసిందే. అయితే అదే రోజున ఆ నియోజకవర్గ అభ్యర్థి, రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పూ యాదవ్‌ బలవంతపు వసూళ్లు మొదలుపెట్టాడు. స్థానిక ఫర్నీచర్‌ వ్యాపారి ఒకరిని తన ఇంటికి పిలిపించుకుని రూ.కోటి ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులివ్వకుంటే చంపేస్తానని కూడా పప్పూయాదవ్‌ ఆ ఫర్నీచర్‌ వ్యాపారిని బెదిరించినట్లు సమాచారం. వచ్చే ఐదేళ్లు ప్రశాంతంగా బతకాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పప్పూ యాదవ్‌ తనను బెదిరించారని ఆ  వ్యాపారి తెలిపారు. 

అయితే ఆ వ్యాపారి పప్పూ యాదవ్‌ బెదిరింపులకు లొంగలేదు సరికదా.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు జూన్‌ 10వ పూర్నియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో  పప్పు యాదవ్‌తో పాటు అతని స్నేహితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్ణియా ఎంపీ తనను గతంలోనూ డబ్బుల కోసం బెదిరించినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  2021 ఏప్రిల్ 2న పప్పూ యాదవ్ తన నుంచి రూ.10 లక్షల సొమ్ము డిమాండ్‌ చేశాడని, 2023లోనూ దుర్గాపూజ సందర్భంగా రూ.15 లక్షల నగదుతోపాటు రెండు సోఫా సెట్లు కావాలని కోరినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో వివరించారు. 

కాగా ఈ వ్యవహారంపై ఎంపీ పప్పూ యాదవ్‌ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. పప్పూ యాదవ్  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనకు 5.67 లక్షలకు పైగా ఓట్లు రాగా, జేడీయూ అభ్యర్థికి 5.43 లక్షల ఓట్లు వచ్చాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)