Breaking News

వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డిపై తప్పుడు కేసు

Published on Wed, 02/05/2025 - 15:01

సాక్షి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డి(Bhumana Abhinay Reddy)పై కేసు నమోదైంది. అలిపిరి పోలీస్‌ స్టేషన్‌(Alipiri Police Station)లో భూమన అభినయ్‌పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. రాజేష్‌ అనే వ్యక్తిని అలిపిరి పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. దీంతో అక్రమ అరెస్ట్‌ను అభినయ్‌రెడ్డి నిలదీశారు. రాజేష్‌ను పీఎస్‌ నుంచి తీసుకెళ్లారంటూ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

కాగా, సోమవారం నిర్వహించాల్సిన తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక కూటమి గూండాల బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు, కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి డిప్యూటీ మేయర్‌ పదవిపై కన్నేసిన నేపథ్యంలో టీడీపీ గూండాలు మొదటి రోజు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో ఉప ఎన్నిక సమావేశ మందిరానికి వెళ్తున్న బస్సుపై రాడ్లతో దాడి చేసి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేశారు. దీంతో కోరం లేక ఉప ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. 

నడి రోడ్డులో ఖాకీల సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పచ్చముఠాలు రెండో రోజు మరింత బరి తెగించాయి. ఉప ఎన్నిక వాయిదా పడిన వెంటనే అదే రోజు రాత్రి కిడ్నాప్‌నకు గురైన అనీష్‌ రాయల్‌ భార్య మమతను సైతం కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయ­కర్త భూమన అభినయ్‌­రెడ్డి.. అనీష్‌ రాయల్‌ నివాసానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’

కూటమి గూండాలు అక్కడికి కూడా చేరుకుని ఆమె ఉన్న నివాసం తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించడంతో తొలుత 100కి ఫోన్‌ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో తిరిగి అభినయ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన అభినయ్‌­రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై కూటమి గూండాలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కౌశిక్, వాసుయాదవ్, అభినయ్‌ డ్రైవర్‌ గాయాలపాలు కాగా, ఓ కారు ధ్వంసమైంది. 

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)