Breaking News

సామాన్యులపైనా ‘రెడ్‌బుక్‌’ వేధింపులు.. లెక్చరర్‌పై తప్పుడు కేసు

Published on Fri, 03/28/2025 - 12:16

చిత్తూరు జిల్లా: తల్లికి వందనం ఏదీ..? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎక్కడ...? పేద విద్యార్థులకు ఎందుకీ కష్టాలు...? అంటూ ఓ ప్రైవేట్‌ కాలేజీ అధ్యాపకుడు తన ఆవేదనను వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే... అతనిపై పోలీసులు నాటుసారా తరలిస్తున్నారని కేసు కట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు అత్యంత దారుణంగా అధ్యాపకుడిపై నాటుసారా తరలిస్తున్నారని కేసు నమోదు చేశారని విద్యార్థులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలు... చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకానికి చెందిన జ్యోతి­కుమార్‌ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఆయన 15 రోజుల కిందట విద్యా సంవత్సరం ముగుస్తున్నా విద్యార్థులకు తల్లికి వందనం అందలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాలేదని, విద్యాదీవెన వంటి సాయం అందలేదని పిల్లల కష్టాలను వివరిస్తూ సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. విద్యా­ర్థులు, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ హయాంలోనే బాగా పని చేశారని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ వీడియో వైరల్‌గా మారడం... జ్యోతికుమార్‌ ప్రశ్నలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు.. అతనిపై పగ­పట్టారు. అతనిపై ఏదో ఒక తప్పుడు కేసు పెట్టా­లని పోలీసులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో కాణిపాకం పోలీసులు గురువారం ఉదయం జ్యోతికుమార్‌ను తన ఇంటి వద్ద నుంచి తీసు­కెళ్లారు. సాయంత్రం వరకు తవణంపల్లి, ఐరాల, కాణిపాకం పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిప్పుతూ అతని గురించి ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. చివరికి రాత్రి సమయానికి నాటు సారా తీసుకొస్తుంటే పట్టుకున్నామని కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ముమ్మా­టీకి కక్షపూరితంగానే చేశారని గ్రామస్తులు, విద్యార్థి, అధ్యాపక సంఘాల నాయకులు, వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.   

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు