Breaking News

నీ హామీలకు డబ్బెక్కడిది బాబూ?

Published on Wed, 05/01/2024 - 06:05

సాక్షి, అమరావతి:  అధికారమే పరమావధిగా ప్రజలను వంచించేందుకు సిద్ధమైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్లు ఇచ్చిన హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు ఆర్థిక నిపుణులను సైతం వేధిస్తోంది. అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు అసలు వాటిని అమలు చేయడం సాధ్యమా? అందుకు ఎంత ఖర్చు అవుతుంది? అంత సొమ్ము ఎక్కడి నుంచి సమీకరిస్తారు? అనే అంశాలకు సమాధానం లేదు. 

 ప్రాథమిక అంచనాల ప్రకారం చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు ఖర్చవుతుంది. అంత డబ్బు సమీకరించుకునే అవకాశం ఉందా? రాష్ట్రంలో అందుకు తగ్గ వనరులు ఉన్నాయా?.. అంటే లేదనే సమాధానం వస్తుంది.  

వాస్తవికంగా ఆలోచిస్తూ.. 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు కాబట్టే సీఎం వైఎస్‌ జగన్‌కు ఇంకా సంక్షేమం అందించాలని మనసులో ఉన్నా కొత్త హామీలు ఇవ్వలేదు. అన్ని లెక్కలు వేసుకుని, వనరుల సమీకరణ చూసుకుని చేయగలిగే హామీలను మాత్రమే ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేస్తున్నారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూరుస్తున్నారు.

దీనికి అదనంగా మరికొంత లబ్ధిని జోడిస్తూ మేనిఫెస్టోను రూపొందించారు. తాము అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, వాటికి అయ్యే ఖర్చు, ఎక్కడి నుంచి సమీకరిస్తామనే విషయాలను ఆయన కూలంకషంగా వివరించారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలోనే డబ్బు జమ చేయడం (డీబీటీ) లాంటి వినూత్న విధానాల ద్వారా చాలా పకడ్బందీగా ఐదేళ్లు ఆర్థిక క్రమశిక్షణ పాటించి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నెట్టుకొచ్చారు.

 పింఛన్లకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు కనుకే రూ.3,500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అప్పులు తెద్దామన్నా అవి కూడా పరిమితులకు లోబడే తేవాల్సి ఉంటుంది. అన్నీ బేరీజు వేసుకుని, ఉన్న వనరులను సది్వనియోగం చేసుకుంటూ పథకాలను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.  

వేలం పాటలా పోటీ పడి హామీలు 
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీస ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారు. చిత్తశుద్ధితో నెరవేర్చే ఉద్దేశం లేనందువల్లే వేలం పాటలో రేటు పెట్టినట్లుగా సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలకే తాను ఇంకా ఎక్కువ ఇస్తానని నమ్మబలికారు. అమ్మఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రకటించారు. 

సీఎం జగన్‌ అమలు చేస్తున్న చాలా పథకాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకటించిన పథకాలను సైతం కాపీ కొట్టి మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను ఏమార్చేందుకు సిద్ధమయ్యారు. మరి ఇన్ని హామీలను అమలు చేయడం సాధ్యమా? ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి ఆయన వద్ద సమాధానం లేదు. మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఒక మీడియా ప్రతినిధి ఈ హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందని అడగడంతో సమాధానం చెప్పకుండా కస్సుమని మండిపడ్డారు.

 దాన్నిబట్టే ఆయనకు తాను ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమైంది. సీఎం జగన్‌ ఇస్తున్నారు కాబట్టి తాను అంతకంటే ఎక్కువ ప్రకటించి ప్రజలను నమ్మించాలి, ఆ తరువాత ఎలాగూ అమలు చేసేది లేదని తనకు అలవాటైన రీతిలో వాగ్దానాలు చేస్తున్నారు.
 
సాధ్యం కాదనే బీజేపీ పట్టించుకోలేదు 
చంద్రబాబు హామీలను అమలు చేయడం సాధ్యం కాదని గుర్తించడం వల్లే బీజేపీ ఆయన మేనిఫెస్టోను అంగీకరించలేదు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతల ఫొటోలు మేనిఫెస్టోలో కనీసం ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. చివరికి మేనిఫెస్టోను తాకడానికి సైతం బీజేపీ పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌సింగ్‌ ఇష్టపడలేదంటే బాబు హామీలపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు హామీలకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి సహకారం ఉండదని చెప్పకనే చెప్పేశారు. 

రాష్ట్రంలో ఆర్థిక వనరులు సమకూర్చుకునే పరిస్థితులు లేక, కేంద్రం సహకరించకపోతే చంద్రబాబు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే దానికి సమాధానమే లేదు. అంటే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసేవి కా­వని తేటతెల్లమైంది. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు, మరోసారి మాయ చేసేందుకే వేలం పాట మాదిరిగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. పొరపాటున జనం నమ్మితే ఇక అంతే సంగతులు. 2014లో మాదిరిగా ఆ మేనిఫెస్టో మాయం కావడం ఖాయం.  

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)