Breaking News

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలి

Published on Sun, 01/21/2024 - 04:29

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కల్వ కుంట్ల కుటుంబంలోని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్, ఎంపీ సంతోష్‌ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు  సవాల్‌ విసిరారు. వీరంతా పోటీచేసినా ఓటమి చెందుతారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గుర్తింపు కోల్పోవడం ఖాయమన్నారు.  శనివారం రఘునందన్‌రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఉందా.. అని మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలకు పార్టీ సత్తా ఏంటో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో చూపెడ తామన్నారు. ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టికెట్లు అమ్ముకోవడం బీఆర్‌ఎస్‌కు అలవాటు
పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా  రూ.వందల కోట్లు సమర్పించుకున్న వారికే టికెట్లు అమ్ముకోవడం బీఆర్‌ఎస్‌ అధినా యకులకు అలవాటని రఘునందన్‌ ఆరోపించారు. పార్టీనే నమ్ము కున్న  ఎర్రోళ్ల శ్రీనివాస్‌ వంటి వాళ్లకు టికెట్లు ఇవ్వరని వ్యాఖ్యా నించారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకున్న ప్పుడే తెలంగాణతో ఆ పార్టీ పేగు బంధం తెగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే హుస్సేన్‌ సాగర్‌లో వేసినట్టేనన్నారు.

ఆ విషయంపై హరీశ్‌ సమాధానం చెప్పాలి
కేఆర్‌ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందంటూ, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడడం సరికాదని రఘునందన్‌ అన్నారు. 2014–2019 మధ్య నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమ క్షంలో... కృష్ణానదీ జలాల పంపకాల సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ హాజరై  299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చా లని సంతకం పెట్టింది వాస్తవమా.. కాదా..?  అని నిలదీశారు. ఈ విషయమై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కు ఈ విషయాలు తెలియవా అని నిలదీశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)