Breaking News

‘రేవంత్‌ డైరెక్షన్‌లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్‌లో ఈడీ’

Published on Tue, 01/07/2025 - 19:15

సాక్షి, హైదరాబాద్‌: రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి రేవంత్‌రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్‌ ప్లాన్ చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు.

‘‘బీఆర్‌ఎస్‌ ఆందోళనలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారు. రైతు బంధు, ఉచిత కరెంటు ఇచ్చి బీఆర్‌ఎస్‌ సంబురాలు చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ  మాత్రం కేసులు పెట్టీ సంబురాలు చేసుకుంటుంది.

..కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తాం. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో చట్టాన్ని రేవంత్‌ దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. కేటీఆర్ నిర్దోషి గా మల్లెపువ్వు లాగా, కడిగిన ముత్యం లాగ బయటకొస్తాడు.

..ఈ ఫార్ములా కారు రేస్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్లా పడటం ఖాయం. రాహుల్  గాంధీ ఈడీ  కార్యాలయానికి లాయర్లను  వెంట బెట్టుకొని వెళ్తారు. కేటీఆర్‌ లాయర్లతో  ఏసీబీ విచారణకు వెళ్ళొద్దా?. రాహుల్‌కి ఒక చట్టం.. కేటీఆర్‌కి ఒక చట్టం కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు ఒకటే.. రేవంత్  డైరెక్షన్‌లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్‌లో ఈడీ పనిచేస్తోంది’’ అంటూ జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.

ఇదీ చదవండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి