Breaking News

బీజేపీలోకి అజ్మీరా చందూలాల్‌ కుమారుడు

Published on Wed, 09/13/2023 - 02:18

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, దివంగత అజ్మీరా చందూలాల్‌ కుమారుడు, బీఆర్‌ఎస్‌ నాయకుడు అజ్మీరా ప్రహ్లాద్‌ బీజేపీలో చేరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు గరికపాటి మోహన్‌రావుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈటల రాజేందర్, ప్రహ్లాద్‌కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీజేపీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు.

కేంద్ర కేబినెట్‌లోని 75 మంది మంత్రుల్లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది గిరిజనులు ఉన్నారని, బీజేపీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అలాగే ఆదివాసీ మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనేనన్నారు. పార్టీ మారితే పెన్షన్‌ తీసేస్తామని బెదిరించడం సరికాదని, పెన్షన్‌ డబ్బులు ప్రజలవే తప్ప సీఎం కేసీఆర్‌ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చిందని, కేసీఆర్‌ డబ్బు సంచులు, మందు సీసాలకు ప్రజలు లొంగకుండా తనను గెలిపించారని అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)