Breaking News

వికృతానందంతోనే జగన్‌పై తప్పుడు కేసు: రఘురామపై అంబటి ఫైర్‌

Published on Sat, 07/13/2024 - 16:29

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు.. వాటిని మేము ఎదుర్కొబోతున్నామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయ నాయకుల ఒత్తిడితో​ ఇప్పుడు కేసులు పెడితే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన.

కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని టీడీపీ ఖండించలేదు. వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వైఎస్‌ జగన్‌, ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై కేసు పెట్టారు. ఆ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు చంద్రబాబు హయాంలో కూడా పని చేశారు.

.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కేసులు పెట్టి వికృతమైన ఆనందం పొందాలని చూస్తున్నారు. నాడు రఘురామ కృష్ణంరాజు ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి చంద్రబాబుతో కలిశాడు. హైదరాబాద్‌లోనే ఉండి మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎల్లో మీడియాతో జతకట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టారు. 

.. రఘురామను అరెస్ట్‌ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టారు. తనను కొట్టారని రఘురామ చెప్పారు. కొడితే గాయాలు ఉండాలి కదా?. తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని కోర్టులో చెప్పారు. కానీ, మూడేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి ఇప్పుడు కేసులు గుర్తుకు వచ్చాయా?. ఇంత కాలం ఎందుకు గుర్తుకురాలేదు’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే అధికారులు ఇబ్బందులు పడతారని, తర్వాత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి వారించారు.

ఇదీ చదవండి: రఘురామ ఓ అబద్ధాలకోరు.. మాజీ ఐపీఎస్‌ సంచలన వ్యాఖ్యలు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)