Breaking News

కాంగ్రెస్‌కు షాక్‌.. సొంత గూటికి మాజీ సీఎం జగదీష్‌ శెట్టర్‌

Published on Thu, 01/25/2024 - 14:18

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలింది. కర్ణాటక మాజీ సీఎం జగదీష్‌ శెట్టర్‌ సొంత గూటికి చేరుకున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శెట్టర్‌.. తిరిగి కమలం గూటికే చేరారు. మాజీ సీఎం యడ్యూరప్ప, ఇతర సీనియర్‌ నేతల ఆధ్వర్యంలో గురువారం కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు ఇతర నేతలతో భేటీ అయిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

కాగా మరో మూడు నెలల్లో లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జగదీష్‌ శెట్టర్‌ బీజేపీలో చేరడం ఆసక్తిగా మారింది. బహుశా ఆయన కాషాయ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. 

చదవండి: బెంగాల్‌లోకి అడుగుపెట్టిన రాహుల్‌ యాత్ర

కాగా జగదీష్‌ శెట్టర్‌.. కర్ణాటకలో రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్‌ వర్గానికి చెందిన నేత.. బీజేపి నుంచి తన సొంత నియోజకవర్గం హుబ్లీ ధార్వాడ్‌ సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన శెట్టర్‌కు.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ నిరాకరించింది. దీంతో అసంతృప్తి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం పచ్చకున్నారు.

ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటి చేసిన తన పదవిని నిలబెట్టుకోలేకపోయారు. బీజేపీ నేత చేతిలో 34 వేల కోట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. తరువాత కాంగ్రెస్‌ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించింది

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)