Breaking News

‘ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం..’

Published on Tue, 10/28/2025 - 17:27

పట్నా:  బిహార్‌లో మ్యానిఫెస్టో వేడి షురూ అయ్యింది.  బిహార్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష ఇండియా కూటమి మంగళవారం(అక్టోబర్‌ 28వ తేదీ) తమ మ్యానిఫెస్టోను ప్రకటించింది. ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే అంశాన్ని మ్యానిఫెస్టోలు చేర్చింది. తాము గెలిస్తే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహాఘట్‌ బంధన్‌(మహా కూటమి)  సీఎం అభ్యర్థి, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రకటించారు. ఈ మేరకు మ్యానిఫెస్టో విడుదల చేసిన ఆయన.. తమ కూటమి గెలిచిన పక్షంలో 20 రోజుల్లోపే ప్రతీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.అదే అంశాన్ని మ్యానిఫెస్టోలో చేర్చామన్నారు.  

ఇక జీవిక పథకం కింద ఉన్న వారిని ప్రభుత్వ ఉ‍ద్యోగులుగా గుర్తింపు ఇస్తామన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి నాయకత్వం వహించే మహిళల కోసం జీవిక అనే పథకం అమలు చేస్తున్నారు. దీనికింద పని చేసేవారిని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు ఇస్తామన్నారు.  కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ రెండు విడ‌త‌ల్లో (న‌వంబ‌ర్ 6, 11) జ‌రుగుతుంది. న‌వంబ‌ర్ 14న ఫ‌లితాలు వ‌స్తాయి.

 

27 మంది తిరుగుబాటు నేతల బహిష్కరణ
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) తాజాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై 27 మంది నేతలను పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ జాబితాలో వివిధ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగిన లేదా అధికారిక ఆర్‌జేడీ అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు.

20 నెలల్లోనే.. 
నవంబర్‌లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)ప్రతిపక్ష మహాఘట్‌ బంధన్‌.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్‌ వన్‌ చేస్తామని పేర్కొన్నారు.

ఎన్డీడీ కూటమి, మహా కూటమిపై ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన కామెంట్స్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)