Breaking News

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 08/05/2024 - 12:57

ఢిల్లీ : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై న్యాయనిపుణులతో మాట్లాడేందుకు కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణలతో,రాజ్యాంగ నిపుణులతో ఇవాళ సాయంత్రం (ఆగస్ట్‌ 5న)భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నాం. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)