Breaking News

షిండే శకం ముగిసింది.. ఆయన మళ్లీ సీఎం కాలేరు: సంజయ్‌ రౌత్‌

Published on Thu, 12/05/2024 - 13:31

ముంబై: మహారాష్ట్రలో పది రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ నేడు(గురువారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్‌ మైదాన్‌లో ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. 

ఈ క్రమంలో శివసేన అధినేత ఏక్‌నాథ్‌ షిండేను మరోసారి సీఎం చేయకపోవడంపై  ఉద్దవ్‌ వర్గం ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే పాలన శకం ముగిసిందని, ఆయన ఇంకెప్పుడూ మహారాష్ట్రకు సీఎం కాలేడని అన్నారు. ఈ మేరకు గురువారం విలేకరులతో సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ షిండేను పావులా ఉపయోగించుకొని ఇప్పుడు పక్కన పెట్టిందని ఆరోపించారు. 

‘షిండే శకం ముగిసిపోయింది. రెండేళ్లు మాత్రమే సీఎంగా ఉన్నారు. ఇప్పుడు అతని వాడుక ముగిసింది. అతడిని పక్కన పడేశారు. షిండే మళ్లీ ఈ రాష్ట్రానికి సీఎం కాలేడు. తమతో జతకట్టే పార్టీలను బలహీనపరిచేందుకు, కూల్చివేయడానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది’ అని ఆరోపించారు.

షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలరని సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఇదేనని,  తమతో పనిచేసే వారి పార్టీని విచ్ఛిన్నం చేసి ఆ పార్టీని లేకుండా చేస్తుందని మండిపడ్డారు. మెజారిటీ ఉన్నప్పటికీ మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 15 రోజులు ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. పాలక కూటమిలో చీలిక  మొదలైందని.. ఈ సమస్య రేపటి నుంచి ఇంక పెద్దదవుతుందని అన్నారు.

‘ఈరోజు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి సీఎం అవుతారు. ఆయనకు మెజారిటీ ఉంది కానీ, 15 రోజుల పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు . అంటే వారి పార్టీ లేదా మహాయుతిలో ఏదో లోపం ఉందని అర్థం. ఇప్పుడు కాకపోయిన రేపు అయినా బయటపడుతుంది. వారు మహారాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం పని చేయడం లేదు. తమ స్వార్థంతో కలిసి వచ్చారు.. కానీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. ఫలితాలను ఇప్పటికీ వారు  అంగీకరించడం లేదు.’ అని పేర్కొన్నారు.

కాగా ముంబయిలో బుధవారం జరిగిన రాష్ట్ర భాజపా కోర్‌ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌  పేరును ఖరారు చేశారు.ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టనుండటం ఇది మూడోసారి కానుంది. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని, వారు కూడా గురువారం తనతోపాటు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ఫడ్నవీస్‌ ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిలో ప్రస్తుతానికి ఒక్కరిపైనే అధికారికంగా స్పష్టత వచ్చింది.

తాను డిప్యూటీ సీఎంగా మరోసారి బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు ఎన్సీపీ అగ్ర నాయకుడు అజిత్‌ పవార్‌ ప్రకటించారు.  ఆయనతోపాటు ప్రస్తుతం మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎంగా ఉన్న శివసేన అధినేత ఏక్‌నాథ్‌ షిండే కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)