Breaking News

నావల్లనే ప్రాబ్లమ్‌ అయితుంది అంటే వెళ్లిపోతా: జేసీ

Published on Sat, 11/16/2024 - 09:18

అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్‌ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.

‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..

బీటెక్‌ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్‌ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.

‘‘పిల్లలకు డిసిప్లిన్‌ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు.  అమెజాన్‌, రెడ్‌బస్‌ ఓనర్లు.. ఎలాన్‌ మస్క్‌.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్‌ కంటే మున్సిపల్‌లో ఊడ్చే పర్మినెంట్‌ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన. 

టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)