Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల కొట్లాట.. బీజేపీపై డిప్యూటీ సీఎం భట్టి సైటెర్లు

Published on Sat, 09/14/2024 - 17:13

సాక్షి, పెద్దపల్లి: తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడటం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే, బాధత్య గల శాసనసభ్యులు బజారు మీదకు వచ్చి తన్నుకోవడం బాధ కలిగించిందన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల తన్నులాట నేపథ్యంలో తమ ఉనికి కోసం బీజేపీ డ్రామాలాడుతోందన్నారు.

కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఉపేక్షించాం. బీఆర్‌ఎస్‌ నేతలు అలాగే రోడ్ల మీదకు వచ్చి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వ ఏం చేయాలో అది చేస్తుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును సైతం  గుంజుకున్నారు. వాళ్ళ మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు. 
అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు వినిపించాలని కోరుకుంటున్నాం.

ప్రతిపక్ష నేతలు అంటే మాకు గౌరవం ఉంది. అసెంబ్లీలో అధికార పార్టీ ఎవరో, ప్రతిపక్ష పార్టీ ఎవరో స్పీకర్ వెల్లడించారు. ప్రతిపక్షంపై కక్ష తీర్చుకోవాలని మాకు లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితం. బీజేపీ కేవలం తమ ఉనికి కోసం రాజకీయ డ్రామాలు ఆడుతుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇది కూడా చదవండి: హైడ్రాపై రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)