Breaking News

ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు

Published on Tue, 06/04/2024 - 03:50

సాక్షి ప్రతినిధి, విజయనగరం: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు సాక్ష్యాలు బట్ట­బయ­లైన నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు పడింది. ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేస్తూ, ఆ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ సోమవారం మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు. ప్రత్యర్థి పార్టీ టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప­డ్డారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపైన, పార్టీ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేశారని శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పాలవలస విక్రాంత్‌ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

స్వయంగా హాజరై దీనిపై వివ­రణ ఇవ్వాలని నాలుగుసార్లు నోటీసులు పంపించినా రఘురాజు డుమ్మాకొట్టారు. మూడునెలల కిందటే రఘురాజు భార్య, ఎస్‌.కోట వైస్‌ ఎంపీపీ ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్‌ సుధారాజు టీడీపీ నేత లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా వేయించుకున్నారు. టీడీపీ ఎస్‌.కోట అభ్యర్థి కోళ్ల లలితకుమారితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రఘురాజు దంపతుల నివాసంలోనే టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.

మరోవైపు కోళ్ల లలితకుమారికి, ఎస్‌.కోట టికెట్‌ కోసం విఫలయత్నం చేసిన గొంప కృష్ణకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు హైదరాబాద్‌లో లోకేశ్‌ సమక్షంలో జరిగిన పంచాయితీలో మండల టీడీపీ నాయకులతో కలిసి రఘురాజు పాల్గొన్నారు. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయా­లని ప్రభుత్వ విప్‌ విక్రాంత్‌ ఫిర్యాదు చేశారు. రఘురాజు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 వరకు పదవీ­కాలం ఉన్నా పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడ­టంతో ఆయన సభ్యత్వం రద్దయింది.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)