Breaking News

అచ్చెన్నాయుడు సమక్షంలో కూటమి నేతల కుమ్ములాట

Published on Tue, 11/05/2024 - 13:15

సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్‌ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు.  సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.

పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్‌
నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తు­న్నా­రని, జనసైనికులను పెదగార్లపాడులో బానిస­లుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్‌.వెంకటేశ్‌ ఆవే­దన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్‌ చేయ­టంతో వైరల్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వరకు ఈ వీడియో చేరేలా షేర్‌ చేయాలని ఆయన కోరాడు.

టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో,  బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడి­­యోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయ­కులు కలిసి పనిచే­శారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వ­రూ­పం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైని­కులు తొత్తుల్లాగా, బానిస­లు­గా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవ­హ­రిస్తు­న్నారని వాపోయాడు.

ఉపాధి అవకా­శాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వా­ములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసు­కుం­టున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడు­తున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయ­కులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.

ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)