Breaking News

బీజేపీ Vs టీడీపీ.. ఆదోనిలో రచ్చ రచ్చ

Published on Fri, 08/16/2024 - 10:58

సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోనిలో బీజేపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధిపై మీనాక్షి నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒకలా బీజెపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారధి వైఖరి సరైంది కాదు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూటమి ఎమ్మెల్యే అని మరచి పోతున్నాడు. ఎమ్మెల్యే పార్థసారథి వాస్తవాలు చెప్పాలి. ఏది పడితే అది చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రభుత్వ కార్యక్రమాలకు నన్ను  పిలువకుండా దూరం పెట్టారు. టీడీపీ వారికి ఏ పనులు చేయడం లేదు. ఇలాగే కొనసాగితే  మున్ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి ఎమ్మెల్యే పార్థసారధి తిరిగి కౌంటర్ ఇస్తూ.. తాను  చెప్పిందే వినాలి అన్నట్లు మీనాక్షి నాయుడు వ్యవహరిస్తున్నారని.. బీజేపీలో, జనసేనలో ఏ వర్గాలు లేవు. కాని టీడీపీలో ఐదు వర్గాలు ఉన్నాయి. పది శాతం తన గురించి ఆలోచిస్తే 90 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తల గురించే ఆలోచిస్తాను. సమస్య అంతా మీనాక్షినాయుడుతోనే’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘కూటమి కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. కార్యక్రమాలకు నేను పిలుస్తున్నా వాళ్లే రావడం లేదని పార్థసారధి అన్నారు.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)