Breaking News

మీసం మెలేసిన కొండా.. తొడగొట్టిన ఇనగాల

Published on Sat, 09/02/2023 - 08:15

సాక్షి, హనుమకొండ: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌ రావు మీసం మెలేయగా.. మరో నేత ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తొడకొట్టడం.. ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు...వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఆత్మకూర్‌ మండలం అగ్రంపహాడ్‌లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ రవీంద్ర ఉత్తమ్‌రావు దల్వీ హాజరయ్యారు.

సమావేశం ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్సీ కొండా, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి వర్గీయులు.. పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ శోభారాణి కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని.. పార్టీ నినాదాలు, జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వీ కార్యకర్తలను ఉదేశించి మాట్లాడి వెళ్లిపోయారు.

ఆయనతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య బయటికి వెళ్లిపోవడంతో సమావేశం ముగిసింది. సమావేశప్రాంగణం బయట కొండా, ఇనగాల ఒకరినొకరు ఎదురు పడ్డారు. ఆ సమయంలో కొండా మీసం మెలేయడం, ఇనగాల తొడ గట్టడం చర్చనీయాంశంగా మారింది.  
చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు?

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)