Breaking News

ప్రధాని మోదీలో అహంకారాన్ని చూశారా? : ఉద్ధవ్‌ ఠాక్రే

Published on Sun, 09/01/2024 - 16:27

ముంబై : ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహరాష్ట్రలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుతాత్మ చౌక్‌ నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వరకు విపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ క్షమాపణలపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు.

మోదీ క్షమాపణల్లో మీరు అహంకారాన్ని చూశారా? ప్రధాని ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకా? అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజ్‌ను అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు.  

ఇక శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే వ్యాఖ్యలపై ఉద్దవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. మేం రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. మేం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర కీర్తి కోసం పోరాడుతున్నాం. మహాయుతి ప్రభుత్వానికి  గెట్ అవుట్ చెప్పడానికి మేము గేట్‌వే ఆఫ్ ఇండియాకు వచ్చాము’అని హెచ్చరించారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)