Breaking News

కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఎల్జీ ఆరోపణలు.. ఖండించిన ఆప్‌

Published on Sat, 07/20/2024 - 14:56

ఢిల్లీ: లిక్కర్ పాలసీ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై తిహార్‌ జైలులో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్య పరిస్థితి రాజకీయ మలుపు తీసుకుంది. సీఎం కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్ట్‌నెట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వీకే సక్సేనా, ఆప్‌ పార్టీ నేతల మధ్య విమర్శలు తీవ్రం అయ్యాయి.

సీఎం కేజ్రీవాల్‌ ఉద్దేశ పూర్వకంగానే బరువు తగ్గుతున్నారని, అందుకు తగ్గట్టుగా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికే సక్సేనా తాజాగా ఆరోపించడంతో వివాదం ముదిరింది. తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారని ఎల్జీ ఆరోపణలు మాత్రమే చేయలేదు. ఈ మేరకు ఆయన  ఢిల్లీ ఛీఫ్‌ సెక్రటరీకి ఒక లేఖ కూడా రాశారు. 

‘సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మెడికల్‌ రిపోర్టుల్లో గ్లూకోమీటర్‌, సీజీఎంఎస్‌ ( రక్తంలో చక్కెర మోతాదులు నిరంతరం గుర్తించి నమోదు చేసే పరికరం. కంటిన్యుయస్‌ గ్లూకోజ్‌ మానిటరింగ్‌) వివరాల్లో తేడాలు  ఉన్నాయి. జూన్ 2న తిహార్‌ జైలుకు వెళ్లినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్‌ కేజీల బరువు తగ్గారు.  ఉద్దేశపూర్వకంగా తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారు. జూన్‌ 2 కంటే ముందు ఆయన 63. 5 కేజీల బరువు ఉండగా... ఇప్పుడు రెండు కేజీలు తగ్గి 61.5 కిలోలకు చేరింది.’ అని ఎల్జీ లేఖలో ఆరోపణలు చేశారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన బరువు, బ్లడ్‌ షుగర్‌ తగ్గుతోందని ఇటీవలే ఆప్‌ మంత్రి అతిశీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఇక్కడ చెప్పుకోల్సిన అంశం. అయితే...

ఎల్జీ వీకే సక్సెనా చేసిన ఆరోపణలపై  ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తీవ్రస్థాయిలో మండిపడింది. ఎల్జీ ఆరోపణలను ఖండించింది. ‘ఎల్జీ సార్.. మీరు ఎలాంటి జోక్ వేస్తున్నారు?. ఎవరైనా రాత్రికి రాత్రి తమ షుగర్ వెవల్స్‌ తగ్గించుకుంటారా? ఇది చాలా ప్రమాదకరం. మీకు ( ఎల్జీ) ఈ వ్యాధి గురించి ఏమి తెలియదు. మీలాంటి వారు ఇలాం​టి లేటర్‌ రాయటం సరికాదు. ఇటువంటి పరిస్థితి మీకు రావొద్దని  దేవుడ్ని కోరుకుంటు​న్నా’ అని ఎల్జీపై విమర్శలు చేశారు.  

‘ఎల్జీ సిమెంట్‌ పరిశ్రమలో పనిచేస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ, ఆయన డయాబెటిస్‌లో స్పెషలైజ్ ఎప్పుడు అయ్యాడో నాకు తెలియదు’ అని ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ ఎల్జీపై సెటైర్లు వేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)