Breaking News

కాంగ్రెస్‌ పోరాటం బీజేపీతోనే కాదు

Published on Sat, 03/30/2024 - 03:56

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోంది కేవలం బీజేపీతో మాత్రమే కాదని, ప్రమాదంలో పడిన రాజ్యాంగ హక్కులను కాపాడే దిశగా పోరా టం కొనసాగుతోందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు గెలిపించాలని, ఆ దిశలో పార్టీ నేతలు కృషి చేయాలని ఆమె కోరారు. శుక్రవారం టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మరింత బలో పేతం చేసేందుకు గాను రాష్ట్రంలో అత్యధిక స్థానా ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీపీసీసీ ప్రచార కమిటీ ప్రతినిధులు పనిచేయాలని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ రాక్షస పాలన, మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.

ఈ సందర్భంగా కేసీఆర్, మోదీల పదేళ్ల దుర్మార్గ పాలన, రేవంత్‌ 100 రోజుల ప్రజాపాలన పోస్టర్‌ను ఆవిష్కరించారు.  సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి పవన్, ప్రచార కమిటీ కో కన్వీనర్‌ తీన్మార్‌ మల్లన్న, సభ్యులు రమ్యారావు, ఆనంద్, వజీర్‌ ప్రకాష్‌ గౌడ్, దయాకర్‌ పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)