Breaking News

ప్రకాశం: చంద్రబాబుకు నిరసన సెగ

Published on Fri, 04/21/2023 - 18:20

సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో దళితులు నిరసనకు దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల బెలూన్లతో దళితులు నిరసనలు తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి జిల్లాలో పర్యటించాలని డిమాండ్‌ చేశారు. 

ఈ క్రమంలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దళిత శ్రేణులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. మంత్రి సురేష్‌ క్యాంప్‌ కార్యాలయంపై టీడీపీ మూకలు రాళ్ల దాడికి దిగాయి. రాళ్ల దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పదేపదే కవ్వింపు చర్యలకు దిగారు టీడీపీ కార్యకర్తలు. 

ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దళిత ద్రోహి. చంద్రబాబుకు యర్రగొండపాలెంలో అడుగుపెట్టే అర్హత లేదు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను మా ప్రభుత్వమే పూర్తి చేసింది. శాంతియుతంగా చంద్రబాబుకు నిరసన తెలుపుతున్నాం’ అని అన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)