Breaking News

హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ భేటీ? 

Published on Fri, 09/01/2023 - 03:07

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరగనున్న తొలి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ  (సీడబ్ల్యూసీ) సమావేశానికి హైదరాబాద్‌ వేదిక కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు ఏఐసీసీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే హైదరాబాద్‌  శివార్లలో ఈనెల 16,17,18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయని కాంగ్రెస్‌ ముఖ్య నేతలు చెపుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైందని వారంటున్నారు.

వాస్తవానికి, ఈనెల 17వ తేదీన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలంగా అనుకుంటోంది. భారీ బహిరంగసభ నిర్వహించి, ఆ సభకు సోనియా గాంధీని ఆహ్వానించి.. ఆమె చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారు. ఈలోపే సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణ అంశం ముందుకు రావడంతో హైదరాబాద్‌లో ఈ సమావేశాలు నిర్వహించి, ఆ సమయంలోనే కాంగ్రెస్‌ అతిరథ మహారథుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు.

ఇందుకోసం ఖర్గేను సంప్రదించిన రేవంత్, సీడబ్ల్యూసీ సమావేశాలను తామే నిర్వహిస్తామని కోరినట్టు సమాచారం. అయితే దీనిపై స్పందించిన ఖర్గే.. సీడబ్ల్యూసీ నిర్వహణ అంత ఈజీ కాదని, నిర్వాహకులతో పాటు పార్టీ నేతలు, మీడియా, ఇతరులకు ఇబ్బంది అవుతుందేమో ఆలోచించాలని సూచించినట్టు సమాచారం. కానీ, కచ్చితంగా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని, కావాల్సిన ఏర్పాట్లన్నీ తాము చూసుకుంటామని రేవంత్‌ భరోసా ఇవ్వడంతో ఖర్గే ఓకే చెప్పినట్టు తెలిసింది.

ఈ సందర్భంగా భారీ సభ కూడా ఏర్పాటు చేయాలని, ఆ సభలోనే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలనే యోచనలో టీపీసీసీ ఉందని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై టీపీసీసీ ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ ‘తొలి సమావేశానికి హైదరాబాద్‌ వేదిక అవుతుంది. అందుకు పార్టీ కూడా ఓకే చెప్పింది. అయితే, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తేదీలు మారే అవకాశం ఉంది. తేదీలు మారినా సీడబ్ల్యూసీ ఫస్ట్‌ మీటింగ్‌ మాత్రం హైదరాబాద్‌లోనే’అని ఆ నాయకుడు స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)