Breaking News

Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ

Published on Fri, 09/06/2024 - 11:59

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో ​భారీ స్థాయిలో అ‍క్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్‌పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.

దీనిపై హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని క‌మిష‌న్ ప్రాథమిక నివేదికను  రూపొందించింది. ఆగ‌స్టు 31వ తేదీన సుమారు 1722 పేజీల‌తో కూడిన నివేదిక‌ను సీఎం సిద్ధ‌రామ‌య్య‌ ప్రభుత్వానికి అంద‌జేసింది. ఈ నేప‌థ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచార‌ణ నిర్వ‌హించేందుకు క‌మిష‌న్‌కు ఆరు నెల‌ల అద‌న‌పు గ‌డువు ఇచ్చారు.

తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్‌ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.

కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు.  ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న  అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌  ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్‌ మైఖెల్‌ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)