Breaking News

ఎన్టీఆర్ జిల్లా: టీడీపీలో చిచ్చు రేపిన నామినేటెడ్ పోస్టుల భర్తీ

Published on Mon, 05/12/2025 - 15:03

సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌కు అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఆప్కాబ్ ఛైర్మన్ పదవిపై రఘురాం ఆశలు పెట్టుకోగా, ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంపై జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఓ ఫంక్షన్ హాలులో  నెట్టెం రఘురాం అనుచరులు, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం పార్టీ కోసం పనిచేశారని.. కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని.. నేడు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా అవమానపరిచారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. నలభై ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నెట్టెం రఘురాంకు పదవి ఇవ్వకుండా చేయడం బాధాకరమన్నారు.

‘‘2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం వెనుక నెట్టెం కృషి ఎంతో ఉంది. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నిలబడిన వ్యక్తి నెట్టెం రఘురాం. రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తన సీటును త్యాగం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన మాట మర్చిపోయారు. తక్షణమే రఘురాంకు ఆప్కాబ్ ఛైర్మన్ లేదా రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలి. పార్టీలో సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం’’ అంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)