Breaking News

తెలంగాణలో టెన్షన్‌.. బీజేపీ ఎంపీ ఈటల ఇంటి వద్ద ఉద్రిక్తత

Published on Mon, 05/12/2025 - 13:38

సాక్షి, మేడ్చల్‌: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మేడ్చల్‌లోని ఈటల ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో, కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈటల ఇంటి వద్ద పోలీసులు మోహరించి.. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

వివరాల ప్రకారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను శాడిస్ట్ అంటూ ఈటల వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలకు నిరసనగా యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు.. ఈటల ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. భారీగా సంఖ్యలో ఈటల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు ఈటల ఇంటికి చేరుకున్నాయి.

అనంతరం, బీజేపీ ఎంపీ ఈటల మాట్లాడుతూ..‘కలెక్టరేట్ల ముట్టడి, కార్యాలయాల ముట్టడి చూశాం.. ఇళ్లను ముట్టడిస్తారా?. కుటుంబాలు ఉంటాయి.. ఇళ్లను ముట్టడించడం పద్ధతి కాదు. అనుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలకు సోయి ఉంటే హైదరాబాద్‌లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయిందో చూడాలి. పాలకుడు అనే వాడు ఏదైనా నిర్మించే ప్రయత్నం చేస్తారు.. డిస్‌స్ట్రక్షన్ చేస్తారా?. 50 ఏళ్లుగా మొదటిసారి చూస్తున్నాను.  డిస్‌స్ట్రక్షన్ చేస్తున్న మొట్టమొదటి దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసులకు భయపడేది లేదు.. అధికారం లేనినాడే కొట్లాడిన పార్టీ బీజేపీ. ఎవరు మోసం చేసే వాళ్లు, ఎవరు సంస్కార హీనులో ప్రజలే చెబుతారు. కుక్కలా అరిస్తే ఏం వస్తుంది?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)