Breaking News

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్‌ నేతల నిరసన

Published on Thu, 09/12/2024 - 15:34

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ మహిళా శ్రేణులు తెలంగాణ భవన్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో  ఆందోళన చేపట్టారు. కౌశిక్‌ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే ఫోటోలు దగ్దం చేశారు. మహిళలపై కౌశిక్‌ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్ లాంటి వల్లనే వదల్లేదని, కౌశిక్‌ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌ వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు.  భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

కాగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌గా ప్రకటించినప్పటి నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు.

అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోగా.. గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్‌ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు.
చదవండి: పక్కా ప్రణాళికతోనే కౌశిక్‌రెడ్డిపై దాడి: హరీష్‌రావు

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)