Breaking News

ప్రధాని మోదీ వ్యాఖ్యలు అవమానకరం: జైరాం రమేశ్‌

Published on Thu, 08/15/2024 - 15:51

ఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్‌​ సివిల్‌ కోడ్‌ (యూసీసీ)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పు పట్టింది.  ఈ మేరకు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ గురువారం ‘ఎక్స్‌’ వేదికగా మోదీ వ్యాఖ్యలపై మం‍డిపడ్డారు.  

‘యూసీసీ గురించి మోదీ మాట్లాడుతూ  ఇప్పటివరకు మనకు  కమ్యూనల్‌ సివిల్‌ కోడ్‌ ఉందనటం చాలా అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మోదీ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానపరిచారు. చరిత్రను కించపర్చటంలో ప్రధాని మోదీకి ఎటువంటి హద్దు లేకుండా పోయింది. 1950లో అంబేద్కర్ హిందూ చట్టాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ఆ సంస్కరణలను ఆర్‌ఎస్‌ఎస్‌, జన్‌ సంఘ్‌ తీవ్రంగా వ్యతిరేకించాయి’అని అన్నారు. 

మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసగంలో.. ‘దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తనం మతపరమైన సివిల్ కోడ్‌తో 75  ఏళ్లు జీవించాం. ఇప్పుడు మనం సెక్యులర్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలి. అప్పుడే దేశంలో మతపరమైన వివక్ష అంతం అవుతుంది. దీంతో సామాన్య ప్రజల మధ్య విభజన పరిస్థితులు దూరం అవుతాయి’అని అ‍న్నారు.

మరోవైపు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మీడియాతో  మట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమే తప్ప బలహీనత కాదు. మనకు స్వాతంత్య్రం తేలికగా వచ్చిందని కొందరు ప్రచారం చేస్తారు. కానీ, లక్షల మంది త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది’’అని అన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)