Breaking News

రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్‌.. దమ్ముంటే పోటీ చేసి గెలువ్‌!

Published on Tue, 04/25/2023 - 15:56

సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. ఖమ్మం వేదిక నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీలో మంత్రి అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేణుకా చౌదరి.

అరే మంత్రి అజయ్ అని సంబోధిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కలని వ్యాఖ్యలను చేశారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ గుట్టలను మింగేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దమ్ముంటే రేణుక తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

‘చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు సంస్కారం ఉంది. నా తల్లిదండ్రులు అది నాకు నేర్పించారు. నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు. న్యాయపరంగా నీచులపై పోరాటం చేస్తాను.

అజయ్ కుమార్‌ను మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మంలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్నట్లు ఉంది. రేణుకా చౌదరి అంటే పబ్భులు, గబ్భులు చరిత్ర అని ఫైర్ అయ్యారు మంత్రి. కేంద్రమంత్రిగా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంటి? ఖమ్మానికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుకా చౌదరికే దక్కుతుంది’ అని మంత్రి పువ్వాడ ఫైర్‌ అయ్యారు.
చదవండి: Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్‌ శెట్టర్‌..

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)