Breaking News

మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా

Published on Sat, 10/26/2024 - 12:07

ముంబై:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు రెండో జాబితాను శనివారం విడుదల చేసింది.  కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం తర్వాత 23 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ముంబైలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. గణేష్ కుమార్ యాదవ్ సియోన్-కోలివాడ స్థానంలో పోటీకి దింపింది.

చార్కోప్ నియోజకవర్గం నుంచి యశ్వంత్ సింగ్ , కండివాలి తూర్పు స్థానం నుంచి కలు బధెలియా బరిలో​కి దిగారు. అయితే.. కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య వివాదంగా మారిన నాగ్‌పూర్ సౌత్ సీటు కాంగ్రెస్‌కు దక్కింది. నాగ్‌పూర్‌ సౌత్‌ నియోజకవర్గం నుంచి గిరీష్‌ కృష్ణరావు పాండవ్‌ బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. 

రెండో జాబితాతో విడుదలతో కాంగ్రెస్ ఇప్పటివరకు మొత్తం 71 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా, మొత్తం 288 నియోజకవర్గాలకు నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44. 2014లో బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)