Breaking News

తప్పుడు హామీలే కాంగ్రెస్‌ రాజకీయం

Published on Wed, 10/02/2024 - 02:01

చండీగఢ్‌: విపక్ష కాంగ్రెస్‌ రాజకీయాలు తప్పుడు హామీలకే పరిమితం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బీజేపీ రాజకీయాలు మాత్రం ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడి పనిచేసేలా ఉంటాయని అన్నారు. నిస్వార్థమైన శ్రమపై, ఫలితాలపై తాము దృష్టి పెట్టామని వెల్లడించారు. మంగళవారం హరియాణాలోని పాల్వాల్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోందన్నారు. తమ ప్రచార సభలకు జనం భారీ సంఖ్యలో హాజరై తమను ఆశీర్వదిస్తుండడం ఆనందంగా ఉందన్నారు.జమ్మూకశ్మీర్‌లో చివరి దశ పోలింగ్‌లో జనం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ప్రజాస్వామ్య వేడుకలో పాలుపంచుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  

హరియాణాలో గత పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ఈసారి కచి్చతంగా గెలుస్తామని ఆశలు పెట్టుకుందని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోనూ ఇలాగే ఆశలు పెంచుకొని భంగపడిందని గుర్తుచేశారు. రాజస్తాన్‌లో రైతులను, యువతను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయతి్నంచిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. హరియాణాలోనూ కాంగ్రెస్‌కు అలాంటి పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఆ పార్టీని జనం మట్టికరిపిస్తారని స్పష్టం చేశారు. 

కష్టపడి పనిచేయాలనే సందేశాన్ని హరియాణా గడ్డపైనుంచి భగవద్గీత తమకు అందిస్తోందని ప్రధాని మోదీ వివరించారు. పని చేయకు, చేయనివ్వకు అనేది కాంగ్రెస్‌ ఫార్ములా అని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే హరియాణాలో అధికారంలో ఉండడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 8న ఫలితాలు వెలువడుతాయి. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు