Breaking News

సోనియానే విస్మరిస్తారా?

Published on Sun, 06/04/2023 - 01:46

సాక్షి, నాగర్‌కర్నూల్‌: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ పేరును సీఎం కేసీఆర్‌ ప్రస్తావించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ మాణిక్‌రావ్‌ ఠాక్రే విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణానికి చేరుకుంది. అచ్చంపేటలోని అంబేద్కర్‌ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఠాక్రే మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్రతో హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించినట్టే.. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారును గద్దె దించుతుందన్నారు. హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, తెలంగాణలోనూ అమలు పరుస్తామని వివరించారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల బతుకులు మారాలని సోనియా తెలంగాణ ఇస్తే, కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా వారి జీవితాల్లో మార్పు రాలేదని ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి చేపట్టిన పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రా నుందని తమిళనాడు సీఎల్పీ నేత సెల్వా పెరుతుంగై అన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్‌ చౌదరి, నదీమ్‌ జావేద్, సిరివెళ్ల ప్రసాద్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ పాల్గొన్నారు.  

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)