Breaking News

సీఎం మార్పునకు హైకమాండ్‌ బ్రేకులు!?

Published on Sun, 01/18/2026 - 07:18

సాక్షి బెంగళూరు/శివాజీనగర: త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి మార్పులు వద్దని కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కూడా సూచనప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. అస్సోం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మరో నాలుగైదు నెలల్లో పూర్తికానుంది. అప్పటివరకు కర్ణాటకతో పాటు ఏ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చెయ్యొద్దని.. యథాతథ స్థితినే కొనసాగించాలని అధిష్టానం తేల్చిచెప్పినట్లు తెలిసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసే వరకు నాయకత్వ మార్పు విషయంలోగానీ ఇతర ఏ అంశాల్లో కూడా చర్చ అవసరంలేదని.. కర్ణాటకలో  రాజకీయాల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని డీకే శివకుమార్‌కు అధిష్టానం స్పష్టంచేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఆ ఎన్నికలపై ప్రభావం పడకూడదనే..
నిజానికి.. కర్ణాటకలో బడ్జెట్‌కు ముందే తనకు సీఎం స్థానం కట్టబెట్టాలని డీకే శివకుమార్‌ పట్టుబట్టారు. అయితే,  ప్రస్తుత పరిస్థితుల్లో నాయకత్వ మార్పుచేస్తే ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ ఎన్నికలను హైకమాండ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున కర్ణాటక రాజకీయాలపై కాకుండా అస్సోంలో గెలుపుపై దృష్టిసారించాలని డీకేకు అధిష్టానం సూచించినట్లు తెలిసింది. అయితే, ఈ ఎన్నికల తర్వాతైనా ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తారా అని హైకమాండ్‌ను డీకే ప్రశ్నించగా.. ‘మీ కృషికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు ప్రతిఫలం తప్పక దక్కుతుంద’ని హైకమాండ్‌ బదులిచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

జాతీయ రాజకీయాల్లోకి రండి..
మరోవైపు.. అస్సోం శాసనసభ ఎన్నికల సన్నద్ధతకు  సంబంధించి శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, అస్సోం రాష్ట్ర నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైకమాండ్‌ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జి డీకే శివకుమార్‌తోనూ చర్చించినట్లు తెలిసింది. అక్కడి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికపై డీకే శివకుమార్‌కు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు సమాచారం. 

ఇదే సమయంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా డీకే శివకుమార్‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా డీకే సేవలను పార్టీకి  ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే డీకే శివకుమార్‌కు మెరుగైన అవకాశాలు ఉంటాయని.. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా హైకమాండ్‌ కోరినట్లు చర్చ జరుగుతోంది.  

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు