Breaking News

సభ నుంచి ఎమ్మెల్యే సీతక్క వాకౌట్‌.. బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 08/06/2023 - 11:55

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్దం కావడం లేదంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సభలోకి వచ్చిన తర్వాత కూడా బిజినెస్ గురించి చెప్పడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, జీరో అవర్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా మంది తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని మాకు చెప్తున్నారు.. కానీ మాకు అవకాశం ఇవ్వకపోతే మేము ఎలా మాట్లాడేదని ప్రశ్నించారు.

అసెంబ్లీ నిర్వహాణ పట్ల ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ.. ‘సభలో అధికార పార్టీ బుల్డోజ్ చేస్తుంది. బీఆర్‌ఎస్‌ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే.. ప్రతీ ఊళ్ళో వాటర్ ప్లాంట్‌లు ఎందుకు పెట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత సేపు మాట్లాడినా మైక్ కట్ చేయరు. మాకు ఓక నిమిషం మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు.

ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ సభను వాడుకుంటుంది. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎన్నికైన సభ్యులు సభలో ఉంటే 9 ఏళ్ళ ప్రగతి గురించి చర్చ ఎలా చేపడుతున్నారు. సమస్యలు లేనప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు జీరో అవర్‌లోలో ఎందుకు అవకాశం ఇస్తున్నారు. సభ నిర్వాహణ మాలాంటి వారికి భాధ కలిగిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
చదవండి: ఎన్నికల వేళ ఇదేం గోల?.. కాంగ్రెస్‌ నేతలకు క్లాస్‌.. అయినా!

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)