Breaking News

'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' రాహుల్‌ ఫ్లయింగ్ కిస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే..

Published on Fri, 08/11/2023 - 14:56

ఢిల్లీ: పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్‌ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడటం రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే రాహుల్‌కు అమ్మాయిల కొరత ఏం లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ మాట్లాడటంపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. 

పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేస్తున్న క్రమంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. అయితే.. రాహుల్ చర్యను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. మహిళా ఎంపీలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య మహిళలపై కాంగ్రెస్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నీతు సింగ్ తాజాగా స్పందించారు. 

నీతు సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు ఇస్తాడు.. కానీ ఆ 50 ఏళ్ల మహిళకు ఎందుకు ఇస్తాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్‌పై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్‌జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహల్ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరిగారు. 

ఇదీ చదవండి: బ్రిటీష్‌ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు