Breaking News

క్రెడిట్‌ కొట్టేయడానికి మోదీ ఆరాటం: కాంగ్రెస్‌

Published on Mon, 09/22/2025 - 07:10

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో నరేంద్ర మోదీ సర్కార్‌ చేపట్టిన మార్పులు లోతైన గాయాలకు కేవలం బ్యాండ్‌–ఎయిడ్‌ వేసి వదిలేసినట్లుగా ఉన్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. కొన్ని రకాల నిత్యావసరాలపై అధికంగా జీఎస్టీ విధించారని, ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.

ఈ క్రమంలో ఖర్గే.. 900 ఎలుకలను తిన్న పిల్లి హజ్‌ యాత్రకు వెళ్లిందన్న సామెత తీరుగా ప్రధాని నరేంద్ర మోదీ తీరు ఉందని ధ్వజమెత్తారు. మోదీ సర్కార్‌ ఇప్పటిదాకా 9 రకాల పన్నుల శ్లాబ్‌లతో గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌ వసూలు చేసిందని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.55 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు. కానీ, ఇప్పుడు ప్రజలకు రూ.2.5 లక్ష కోట్లు కోసం ఆదా చేశామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఖర్గే దుయ్యబట్టారు.

జీఎస్టీ సంస్కరణల విషయంలో మొత్తం క్రెడిట్‌ కొట్టేయడానికి ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. నిజానికి జీఎస్టీలో ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలు ఏమాత్రం సరిపోవని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలన్న డిమాండ్‌ను కేంద్రం విస్మరించిందని ఆక్షేపించారు. జీఎస్టీ 2.0 తీసుకురావాలని తాము 2017 జూలై నుంచే డిమాండ్‌ చేస్తున్నామని గుర్తుచేశారు. జీఎస్టీలో సంస్కరణలను మరింత విస్తరింపజేయాలని కేంద్రానికి సూచించారు.      

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)