చిరుకు జగ్గారెడ్డి చురకలు

Published on Fri, 07/19/2024 - 15:54

హైదరాబాద్‌, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని పలు సినిమాలు తీసిన చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.   

‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం.

.. ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే చెల్లింది. 

.. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్‌కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్‌కు ఎందుకు సపోర్ట్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

.. బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు.  తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)