Breaking News

హరీష్‌.. కేసీఆర్‌ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్‌

Published on Sat, 10/05/2024 - 15:23

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సవాల్‌ విసిరారు. రుణమాఫీకి సిద్దమా? అని చాలెంట్‌ చేశారు.

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రుణమాఫీపై హరీష్‌ రావుకు సవాల్‌ చేస్తున్నాను. రుణమాఫీపై చర్చకు బీఆర్‌ఎస్‌ సిద్దామా?. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్‌ రావాలి. సీఎం రేవంత్‌ను ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను. కేసీఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా?. మాతో చర్చకు మీకు భయంగా ఉంటే.. సిద్దిపేటలోనే చర్చ పెట్టండి.

రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్‌ అయ్యాం. కానీ, బీఆర్‌ఎస్‌ మాత్రం పబ్లిసిటీలో పాస్‌ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెబుతున్నాం. దీనిపై హరీష్‌ రావు సహా, బీఆర్‌ఎస్‌ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్‌ దివాలా తీశారు. బీఆర్‌ఎస్‌ పాలన సమయంలో ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. రుణ మాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు’ అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: రేవంత్‌.. ముందు రెడ్డికుంటలో నీ ఇల్లు కూల్చేవేయ్‌: కేటీఆర్‌
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)