Breaking News

నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

Published on Sun, 10/20/2024 - 06:05

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో గోషామహల్‌ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. 

బీఆర్‌ఎస్‌ ఓర్వలేకపోతోంది..
మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్‌ఎస్‌ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్‌ఎస్‌ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్‌ బేగ్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)