Breaking News

కొండా సుస్మిత ఎపిసోడ్‌.. స్పందించిన రోహిన్‌ రెడ్డి

Published on Thu, 10/16/2025 - 09:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జూబ్లీహిల్స్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్‌ సిమెంట్‌, రోహిన్‌ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి స్పందించారు.

కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్‌ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్‌కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.

సుస్మిత ఆరోపణలు..
ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్‌పై మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్​ సిమెంట్​ వాళ్లను సుమంత్​ గన్‌తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్​ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్‌ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్‌ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్‌ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్‌ చేశారు.

బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్‌ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్‌ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్‌మెన్‌లు ఎందుకని ఆమె ప్రశ్నించారు.

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)