Breaking News

మంత్రి కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Published on Wed, 11/29/2023 - 16:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.  రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న  టైమ్ లో దీక్ష  దివస్‌ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తక్షణమే దీక్షా దివస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

తెలంగాణ భవన్‌లో నేడు దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని ఇచ్చి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది దీక్షా దివస్‌ను జరుపుతున్నారు. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్‌ స్వ్కాడ్‌ టీమ్‌ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నేతలు, లీగల్‌ టీమ్‌  సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు. 

దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్‌ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్‌ లోపలే కార్యక్రమం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇక, కమిషన్‌ సూచనల మేరకు తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దీక్ష దివస్‌ సందర్భంగా కేటీఆర్‌ రక్తదానం చేశారు. 

ఇదీ చదవండి: తెలంగాణ భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)