Breaking News

కాంగ్రెస్‌, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్‌!

Published on Fri, 10/17/2025 - 07:07

న్యూఢిల్లీ: బీహార్‌ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్‌ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌ రామ్‌ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నేత షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ ప్రకాశ్‌ గరీబ్‌ దాస్‌కు బెచ్వాడా సీటు కేటాయించారు.

బగాహాలో జయేశ్‌ మంగళ్‌ సింగ్, నౌతన్‌లో అమిత్‌ గిరి, చన్‌పటియాలో అభిషేక్‌ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్‌లో శ్యామ్‌ బిహారీ ప్రసాద్‌ పోటీ చేయనున్నారు. గోవింద్‌గన్‌ స్థానం నుంచి శశి భూషణ్‌ రాయ్‌ అలియాస్‌ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్‌ కుమార్‌ సింగ్‌ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్‌జేడీ సహా మహా ఘఠ్‌బంధన్‌ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్‌ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ  చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్‌ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.

101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూ
మరోవైపు.. బీహార్‌లో అధికార ఎన్‌డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్‌(యునైటెడ్‌) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్‌ నితీశ్‌ కుమార్‌ తన రాష్ట్ర కేబినెట్‌ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్‌ ఇచ్చారు. విజయ్‌ చౌదరి, బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్‌ సింగ్, విభా దేవి, చేతన్‌ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)