Breaking News

మన సభలకు జనం రారేంటి!

Published on Sun, 04/14/2024 - 05:08

సాక్షి, అమరావతి: ఓ పక్క ముఖ్యమంత్రి,  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర అశేష ప్రజానీకంతో సాగు­తోంది. అంతకు ముందు సీఎం జగన్‌ పాల్గొన్న సిద్ధం సభలూ ఘన విజయం సాధించాయి. మరి మన బాబు సభలేమిటి ఇంతగా తేలిపోతున్నాయి.. టీడీపీ నేతల్లో అంతర్మథనమిది. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు నిర్వ­హిస్తున్న ప్రజాగళం సభలకు కనీస స్థాయి­లో జనం రావడంలేదు. బాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని పవన్‌ కళ్యాణ్‌ని తీసుకువచ్చినా ఫలితం సున్నా.

నాలుగు రోజు­లక్రితం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కూటమి సభలో చంద్రబాబు, పురందేశ్వరితో­పాటు పవన్‌ కూడా పాల్గొన్నారు. అయినా ఈ సభకు నాలుగైదు వేల మంది కూ­డా రాలేదు. దీంతో ఏం చేయాలో పాలు­పోక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు తణుకు సభకూ జనం ఆశించిన స్థాయిలో రాలేదు. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో జన సమీకరణ భారీగా చేయా­లని ఆ జిల్లా నాయకులపై ఒత్తిడి తెచ్చారు.

జిల్లా నాయకులు ఎంతగా ప్రయత్నించిన ఫలి­తం లేకపోయింది. తమ పార్టీ సభలకి ప్రజల్ని తీసుకురావడం కష్టంగా మారిందని, ఎంత చెప్పి­నా, ప్రలోభపెట్టినా రావడంలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. బాబు ఒక్కడే విడిగా పెడుతున్న సభల పరిస్థితి ఇంకా దయ­నీయంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకి రెండు, మూడు సభలు పెడుతున్నా, ఒక్క చోట కూడా అనుకున్న స్థాయిలో ప్రజలు రావడంలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు.

పలుచగా ఉన్న సభల్ని చూసి మిగిలిన ప్రాంతాల్లోని కేడర్‌ నీరుగారిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపించేందుకు చిన్న సెంటర్లు, చిన్న రోడ్లను ఎంచుకుని సభలు పెడుతున్నారు. అక్కడికి అతి కష్టం మీద కొద్దిపాటి జనాన్ని తీసుకువచ్చి ఫొటోలు, వీడియోలతో వాటినే గొప్పగా ఉన్నట్లు చూపిస్తున్నారు. 

బాబు స్పీచ్‌ మొదలైతే.. జనమూ జంపే... 
మరోవైపు సభలకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాబు ప్రసంగం మొదలవగానే  వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.  బాబు ప్రసంగం అంటేనే గంటా గంటన్నరపాటు ఊకదంపుడు స్పీచ్‌ ఉంటుంది. అందులోనూ విషయం లేకపోవడంతో వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. వైఎస్‌ జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతుండ­డంతో ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగు సభలను చూస్తే బాబు మాట్లాడుతున్నప్పుడు వింటున్నవారి సంఖ్య చాలా స్వల్పం.

ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ను తిట్టడం, ఈర‡్ష్య, ద్వేషాలను బయటపెట్టుకోవడం తప్ప బాబు ప్రసంగాల్లో కొత్త­ద­నం కనిపించడంలేదని చెబుతున్నారు. దానివల్లే జనం ఏమీ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కడుపు మంటనంతా వెళ్లగక్కి, కళ్లు మూసుకుని గంటల తరబడి అబద్ధాలను చెబుతూ వాటినే గొప్ప ప్రసంగాలుగా ఫీల్‌ అవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఈసారి ఎలాగైనా జనాన్ని తీసుకురండి.. నేతలకు హెచ్చరికలు  
గత నెలలో చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించిన సభను కూడా టీడీపీ విజయవంతం చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో నిర్వహించిన ఆ సభలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, సభ కూడా అట్టర్‌ఫ్లాప్‌ అవడంతో బాబుకు షాక్‌ తగిలినట్లయింది. ఆ తర్వాత నుంచి ‘ప్రజా గళం’ పేరుతో నిర్వహించిన సభలేవీ జనాన్ని ఆకర్షించలేదు.

అంతకుముందు ‘రా కదలిరా’ పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలూ తేలిపోయాయి. దీంతో ఏం చేయాలనే దానిపై కూటమి అగ్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సభలు విఫలమవడంపైనా చర్చించారు. ఈసారి ఎలాగైనా కొన్ని సభలకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ సీనియర్‌ నేతలకు చంద్రబాబు చెప్పారు.

రాబోయే వారం రోజుల్లో వరుసగా 13 సభలకు ప్రణాళిక రూపొందించి అక్కడి నేతలకు ముందుగానే హెచ్చరికలు చేశారు. జన సమీకరణ బాగా ఉండాలని, లేకపోతే బాబు గారు తిడతారని పరిశీలకులు అక్కడి ఇన్‌ఛార్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల నేతలు మాత్రం జనం రాకపోతే తామేం చేయలేమంటూ 
చేతులెత్తేస్తున్నారు.   

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)