Breaking News

‘గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలుస్తాడు’

Published on Thu, 05/29/2025 - 18:17

మేడ్చల్‌ జిల్లా:  పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌కు కాంగ్రెస్‌ పూర్తి మద్దతిస్తే,  యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు(గురువారం) మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు అంటూ ప్రధాని మోదీని విమర్శించారు.

‘ఉగ్రదాడి తర్వాత కేంద్రానికి పూర్తిగా మద్దతిచ్చాం. యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు?, మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?, అమెరికా  ఒత్తిడికి తలొగ్గి యుద్ధం ఆపేశారా?, మన పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధానిని కోరాం.

పాక్ ను ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలని కోరాం. భారత్‌ను బెదిరించడానికి ట్రంప్‌ ప్రకటన చేయడం బాధాకరం​.  యుద్ధాన్ని విరమించినప్పుడు మోదీ అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు. గతంలో అమెరికా బెదిరింపులను ఇందిరాగాంధీ పట్టించుకోలేదు.  అప్పట్లో పాక్‌ను ఓడించి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే.. యుద్ధాన్ని గెలవగలడు. పాక్‌ను ఓడించాలంటే ఇందిరాగాంధీ బాటలో మోదీ నడవాలి. ఇదే విషయాన్ని రాహుల్‌గాంధీ చెప్తే విమర్శిస్తున్నారు’ అంటూ సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.  

 

ఇది చదవండి:
 ‘మోదీ జీ.. ఎవరి సత్తా ఏంటో ఎన్నికల్లో చూస్కుందాం’

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)